ఎదురుచూపులకు తెర | - | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులకు తెర

Jul 31 2025 7:24 AM | Updated on Jul 31 2025 9:10 AM

ఎదురుచూపులకు తెర

ఎదురుచూపులకు తెర

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందించింది. రుణాలు సక్రమంగా చెల్లించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాల్లో తిరిగి వడ్డీని ఏడాదికోసారి ప్రభుత్వమే జమ చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన వడ్డీతో వారికి ఆర్థికభారం తగ్గుతోంది. మూడేళ్లుగా రుణాలు తీసుకుని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడుదల చేసింది. జిల్లాలో 8,552 స్వయం సహాయక సంఘాలకు ఆరునెలల బకాయి డబ్బులు రూ.11,77,51,865 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

చెల్లింపులో జాప్యం

మహిళా సంఘాలు చెల్లించిన రుణాల వడ్డీని తిరిగి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఆరేళ్ల క్రితం తెలిపింది. ఆ మాట ప్రకారం సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలపై డబ్బును బ్యాంకుల్లో చెల్లించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 మార్చి వరకు సక్రమంగానే వడ్డీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం జాప్యం జరగడంతో సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత వడ్డీ డబ్బు కోసం ఎదురుచూపులే మిగిలాయని, ఎట్టకేలకు వడ్డీ రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు.

రుణాలతో ఆర్థికాభివృద్ధి

జిల్లా వ్యాప్తంగా 8,552 స్వయం సహాయక సంఘాలున్నాయి. సభ్యులంతా సీ్త్రనిధి రుణాలతో ఆర్థికాభివృద్ధి పొందుతున్నారు. పలువురు సభ్యులు వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటుండగా, మరికొంత మంది రుణాలను సక్రమంగా చెల్లించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహక వడ్డీని పొందుతున్నారు. అప్పుడప్పుడు వడ్డీ సకాలంలో జమకాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అందిస్తున్న వడ్డీతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు.

మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ

రూ.11.77 కోట్ల బకాయిలు చెల్లింపు

జిల్లాలో 8,552 స్వయం సహాయక సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement