బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

Jul 29 2025 4:42 AM | Updated on Jul 29 2025 9:25 AM

● ఎస్పీ మహేశ్‌ బి గీతే

సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బి గీతే పేర్కొన్నారు. వివిధ సమస్యలపై 25 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులను ఆదేశించారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

గల్ఫ్‌ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): గల్ఫ్‌కార్మిక కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్‌ కార్మిక సంఘం జేఏసీ నాయకులు పర్ష తిరుపతి, జనగామ శ్రీనివాస్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి సోమవారం విన్నవించారు. జిల్లా నుంచి వేలాది మంది దుబాయ్‌, షార్జా, బహ్రెయిన్‌, ఒమన్‌ దేశాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్నారన్నారు. గల్ఫ్‌లో మోసాలకు గురైన వారిని ఆదుకోవాలని కోరారు. గల్ఫ్‌ వెళ్లే వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం

వేములవాడ: నిజామాబాద్‌ పట్టణానికి చెందిన మమత–రాజేందర్‌ దంపతులు తమ కుమార్తె జి.రష్మిక పేరిట రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళంగా ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్‌కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించి, ప్రసాదాలు అందజేశారు.

నేడు గోశాలలో వనమహోత్సవం

రాజన్న గోశాలలో ఆలయ ఉద్యోగులు మంగళవారం వనమహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో రాధాభాయి తెలిపారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా హాజరవుతారని చెప్పారు.

అన్నపూర్ణలో 1.27 టీఎంసీలు

ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో 1.27 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం తెలిపారు. ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వర్షపు నీరు వచ్చి చేరుతోందని 20 క్యూసెక్కుల నీరు అవుట్‌ ఫ్లో వెళ్తోందని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్‌ డాక్టర్ల నియామకం

సిరిసిల్లకల్చరల్‌: కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వైద్యుల నియామక ప్రక్రియను సోమవారం చేపట్టారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధ్యక్షతన మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జె.రాజేశ్వరీ సమక్షంలో మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రొఫెసర్‌ 1, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 2, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 6 పోస్టులతోపాటు మరో ఆరుగురిని రెసిడెంట్‌ డాక్టర్లుగా నియమించారు. మొత్తం 15 మంది వైద్యులతోపాటు ఒక సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టును భర్తీ చేశారు.

ఉమెన్స్‌ కిక్‌ బాక్సింగ్‌లో ప్రతిభ

సిరిసిల్లటౌన్‌: ఉమెన్స్‌ కిక్‌ బాక్సింగ్‌ లీగ్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈనెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఖేలో ఇండియా కిక్‌ బాక్సింగ్‌ ఉమెన్స్‌ లీగ్‌లో జిల్లా స్పోర్ట్స్‌ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ బాక్సర్లు మాస్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. 6 బంగారు పతకాలు, 4 వెండి, 5 కాంస్య పతకాలు సాధించారని జిల్లా అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్‌ తెలిపారు.

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
1
1/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
2
2/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
3
3/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
4
4/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement