
నేడు కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
సిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర బీసీ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2013లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. అప్పటి నుంచి సిరిసిల్లలో కొనసాగింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 50 సీట్లను కేటాయించింది. దీనికి సంబంఽధించిన ఉపాధ్యాయులు, సిబ్బంది అవసరమైన వసతులు కల్పించారు. ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో అధునాతన అంగులతో నిర్మించిన నూతన భవనం 2025, ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ భవనం నేడు ప్రారంభంకానుంది. విద్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకంతా మజుందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి (స్వతంత్ర ఇన్‌చార్జి) జయంత్ చౌదరీలు హాజరుకానున్నారు.