ఎరువులు అందుబాటులో ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అందుబాటులో ఉంచాలి

Jul 26 2025 10:16 AM | Updated on Jul 26 2025 10:24 AM

ఎరువు

ఎరువులు అందుబాటులో ఉంచాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని జాయింట్‌ రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటీవ్‌ సొసైటీస్‌ ప్రసాద్‌ సూచించా రు. మండలంలోని నేరెళ్ల పీఏసీఎస్‌ గోదాంను సిరిసిల్ల జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సింగిల్‌విండో చైర్మన్‌ కోడూరి భాస్కర్‌గౌడ్‌, అసిస్టెంట్‌ రిజిష్ట్రార్‌ బి.రమాదేవి, సీఈవో అజయ్‌కుమార్‌, సిబ్బంది అంజయ్య, రాజయ్య, సాయి పాల్గొన్నారు.

‘యాచించే స్థాయికి చేర్చవద్దు’

గంభీరావుపేట(సిరిసిల్ల): ఆలయాల్లో పూజ లు చేసే అర్చకులు నిత్యం వేలాది మంది భక్తులను దీవిస్తారని.. అలాంటి వారిని యాచించే స్థాయికి పాలకులు తీసుకురావద్దని అర్చక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల పార్థసారథి కోరారు. గంభీరావుపేటలో దూపదీప నైవేద్య సంఘం కార్యవర్గం సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ ఎందరో అర్చకులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, ఆరోగ్యకార్డులు అందించాలని కోరా రు. గౌరవ అధ్యక్షుడు కొండమాచారి, ఉపాధ్యక్షుడు బిట్కూరి గోపాలాచార్యులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గొంగళ్ల రవి, ప్రధాన కార్యదర్శి ప రాంకుశం, రమేశ్‌, కోశాధికారి కందాలై వెంకటరమణాచార్యులు, సంతోష్‌శాస్త్రీ ఉన్నారు.

30న మాదిగల ఆత్మీయ సన్మాన సభ

సిరిసిల్లఅర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 30న నిర్వహించే మాదిగల ఆత్మీయ సన్మానసభను విజయవంతం చేయాలని అంబేడ్కర్‌ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాదిగల ఆత్మీయ సన్మానసభకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు 8 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అంకని భాను, నేదురు లక్ష్మణ్‌, కొట్టెపల్లి సుధాకర్‌, నక్క నర్సయ్య, నారాయణ, పర్శరాములు, రాము, దేవయ్య, బాలకిషన్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

పద్మశాలీ సంఘం ఎన్నికలు నిలిపివేత

సిరిసిల్లకల్చరల్‌: సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఏకపక్షంగా నిర్వహించతలపెట్టిన ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించడంతో యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీ నాటికి విచారణను వాయిదా వేసింది. పట్టణ పద్మశాలి సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని భావించిన సంఘం బాధ్యులు అడ్‌హాక్‌ కమిటీ వేశారు. దాదాపు 9600 నూతన సభ్యత్వాలను సేకరించారు. పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ఫీజును భారీగా నిర్ణయించారని చిమ్మని ప్రకాశ్‌, కోడం రవి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం యథాతథస్థితి కొనసాగించాలంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు

వేములవాడఅర్బన్‌: శుభకార్యాలు, తీర్థయాత్రలకు వెళ్లడానికి భారీ తగ్గింపు ధరలకు బస్సులను పంపించనున్నట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పల్లెవెలుగు గతంలో కిలోమీటర్‌కు రూ.68 ఉండగా ఇప్పుడు రూ.52, ఎక్స్‌ప్రెస్‌ గతంలో రూ.69 ఉంటే రూ.62, డీలక్స్‌కు రూ.65 ఉంటే రూ.57, సూపర్‌ లగ్జరీ కిలోమీటర్‌కు గతంలో రూ.65 ఉంటే ప్రస్తుతం రూ.59లకు ఇవ్వనున్నట్లు వివరించారు. పల్లెవెలుగు బస్సు 100 కిలోమీటర్లకు గతంలో రూ.12వేలు ఉంటే ప్రస్తుతం రూ.9,350లకే ఇవ్వనున్నట్లు వివరించారు. వివరాలకు 99592 25926, 73828 51826, 94405 21412లలో సంప్రదించాలని డీఎం కోరారు.

ఎరువులు అందుబాటులో ఉంచాలి
1
1/2

ఎరువులు అందుబాటులో ఉంచాలి

ఎరువులు అందుబాటులో ఉంచాలి
2
2/2

ఎరువులు అందుబాటులో ఉంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement