
ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం
సద్వినియోగం చేసుకోవాలి
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పుణ్యక్షేత్రాల ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు సర్వీసులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా వెళ్లి రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. వివరాలకు ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని సంప్రదించండి.
– ప్రకాశ్‌రావు, ఆర్టీసీ డిపో మేనేజర్, సిరిసిల్ల
గంభీరావుపేట(సిరిసిల్ల): భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఆర్టీసీకి కలిసొస్తుంది. పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు లేక రెండు, మూడు ప్రాంతాల్లో దిగడం, ఎక్కడం ఇబ్బందిగా భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇటీవల అరుణాచలం గిరిప్రదక్షిణ, యాదాద్రి దర్శనాలకు భక్తులకు తీసుకెళ్లి వచ్చారు.
గత నెల 27 నుంచి..
రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 27న ఆర్టీసీ అధికారులు ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల డిపో నుంచి పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏర్పాటు చేసిన సర్వీసులకు స్పందన బా గుంది. ఇప్పటి వరకు మానసాదేవి, కొమురవెళ్లి, వర్గల్, యాదాద్రి, స్వర్ణగిరి దర్శనానికి ఒకటి, అరుణాచలంకు మరో బస్సు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు వెళ్లి వచ్చాయి. డిపో నుంచి మొదలయ్యే బస్సు నిర్ధేశిత ప్రాంతాలకు వెళ్తూ ఆలయాల సందర్శనకు సమయం ఇచ్చి తిరిగి బయలుదేరి వస్తున్నా యి. భక్తులు బృందంగా ఏర్పడి ముందుకొస్తే అద్దెకిస్తామని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
యాదాద్రికి రూ.750
యాదాద్రికి పెద్దలకు టికెట్ రూ.750, పిల్లలకు రూ.420 చొప్పున నిర్ణయించారు. మానసాదేవి టెంపుల్, కొమురవెల్లి, వర్గల్, యాదాద్రి, స్వర్ణగిరి ఆలయాలను సందర్శించుకునే అవకాశం ఉంది. ఈ యాత్ర ఒక్క రోజులోనే ముగుస్తుంది.

ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం