
కళాశాలల్లో ప్రవేశాలు పెంచండి
సిరిసిల్లకల్చరల్: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు పెంచేందుకు లెక్చరర్‌లు కృషిచేయాలని ఇంటర్‌బోర్డు ప్రత్యేకా ధికారి రమణారావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. ఫస్టియర్ అడ్మిషన్ల పెంపు విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. ఎప్సెట్, జేఈఈ, నీట్ పోటీపరీక్షల సన్నద్ధతకు ‘ఫిజిక్స్‌వాలా’ వంటి సాంకేతికతను వినియోగిస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. డీఈవో శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్, అధ్యాపకులు ఉన్నారు.
‘అధికంగా వసూలు చేయరాదు’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారలు నుంచి అధిక ధరలు వసూలు చేయరాదని తంగళ్లపల్లి తహసీ ల్దార్ జయంత్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్‌లో బుధవారం ఇందిరమ్మ కమిటీ, ట్రాక్టర్ యజమానులతో మండల అధికారులు సమావేశమయ్యారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. వారంలో రెండు రోజులు ఇసుకను బుధ, శుక్రవారాలు, మట్టిని మంగళ, గురువారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అఫ్జల్‌బేగ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు టోని, చెన్నమనేని ప్రశాంతత్, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌వో రజిత
బోయినపల్లి(చొప్పదండి): సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు స్కూల్, హాస్టల్స్ తరచూ సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య సూచనలు చేయాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. మండలంలోని కోరెం, తడగొండ సబ్‌సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. సబ్‌సెంటర్లలోని రికార్డులను పరిశీలించారు. పిల్లలకు వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంట సేపు పరిశీలనలో ఉంచాలని సూచించారు. టీబీ, లెప్రసీ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సంపత్, జిల్లా టీబీ, లెప్రసీ ప్రోగ్రాం అధికారి అనిత, జిల్లా ఎన్‌సీడీ అధికారి రామకృష్ణ, సబ్‌సెంటర్ ఆరోగ్య కార్యకర్తలు వసంత తదితరులు పాల్గొన్నారు.
రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
● ‘సెస్’ ఎండీ సుబ్బారెడ్డి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం పద్మనాయక ఏసీ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు ‘సెస్’ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి బుధవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక–2, (సీజీఆర్‌ఎఫ్–2) నిజామాబాద్ చైర్‌పర్సన్ నారాయణ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు వివరించారు. పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు హాజరై సమస్యలను వివరించాలని కోరారు.
తరచూ మరమ్మతులు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో తాగునీటి పైపులైన్లు తరచూ పగిలిపోతున్నాయి. మెయిన్ రోడ్డు కిందే పైపులైన్ ఉండడంతో భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమవుతున్నాయి. దీంతో నీటి సరఫరాలో తరచూ అవంతరాలు ఎదురవుతున్నాయి. సర్ధార్ పాపన్న విగ్రహం నుంచి అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాల వరకు ఇప్పటికే నాలుగుచోట్ల పైపులు పగిలిపోయాయి. పక్షం రోజులుగా పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా నీరు లీకవుతుంది. దీనిపై కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ కొత్తగా పైపులైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

కళాశాలల్లో ప్రవేశాలు పెంచండి

కళాశాలల్లో ప్రవేశాలు పెంచండి

కళాశాలల్లో ప్రవేశాలు పెంచండి