
బడిపాఠం.. బతుకునేస్తం
రాజన్నకు సందడి
వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
● చదువులమ్మ చెట్టు నీడలో.. విరిసిన విద్యాకుసుమాలు ● ఆరున్నర దశాబ్దాలుగా వెలుగులు పంచుతున్న గంభీరావుపేట హైస్కూల్ ● నాటి విద్యార్థులు.. నేటి అధికారులు
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
గంభీరావుపేట(సిరిసిల్ల): అది స్వాతంత్య్రానికి ముందు ఏర్పడ్డ ప్రాథమికోన్నత పాఠశాల. కాలక్రమంలో హైస్కూల్‌గా మారి ఆరున్నర దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతోంది. అప్పట్లో సిరిసిల్ల, గాలిపల్లి, గంభీరావుపేటలో తప్ప మరెక్కడా ఉన్నత పాఠశాల లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఇక్కడ ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 67 ఏళ్ల చరిత్ర ఉంది. 1943లో నెలకొల్పిన ప్రాథమికోన్నత పాఠశాల.. 1958లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెంది గ్రామీణ ప్రాంతంలో విద్యాకుసుమాలను తీర్చిదిద్దుతోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఉర్దూ మీడియం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా విడిపోయి కేజీ టు పీజీ ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. గ్రామంలో చిన్న పెంకుటిల్లులో మొదలైన బడి నేడు విద్యాపీఠంగా ఎదిగింది. 67 వసంతాలు పూర్తి చేసుకుని సగర్వంగా నిలబడింది. ఈ పాఠశాలలో చదువుకున్న వారు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, అధ్యాపకులు, అధికారులు, వ్యాపారవేత్తలుగా అనేక రంగాల్లో ఎదిగిన వారు ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దినవారే. గురువుగారిని గౌరవించు.. పుస్తకాన్ని నమ్ము.. చదువులోనే నీ జీవితం మార్గం ఉంది.. అనే మౌలిక భావన తమ విజయాల్లో భాగస్వామిగా మారిందని పూర్వ విద్యార్థులు చెబుతుంటారు. ప్రస్తుతం పాఠశాల నూతన రూపాన్ని సంతరించుకుంది. స్మార్ట్ క్లాస్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, పుస్తక సమృద్ధి గ్రంథాలయాలు ఏర్పాటై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతున్నాయి.
జీవితాలనే మార్చేసిన విద్యాలయం
మా చిన్నతనంలో క్రమశిక్షణతో కూడిన విద్యనందించిన విద్యాలయం గంభీరావుపేట పెద్దబడి. మా జీవితాలనే మార్చేసిన విద్యాసంస్థ. నేను ఈ పాఠశాలలో 1982–83 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసుకున్న. పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన. ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లినప్పుడు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం. పాత వారిలా ఇప్పటి విద్యార్థులు లక్ష్యాల వైపు దూసుకెళ్లాలి.
– జీవన్‌రెడ్డి, డీఎస్పీ,
గంభీరావుపేట
ఆ జ్ఞానంతోనే మా విజయాలు
మా విద్య, ఉద్యోగ విజయాల వెనుక గంభీరావుపేట పెద్దబడి గొప్పతనం ఉంది. నేను ఈ బడిలో ప్రాథమిక విద్యతోపాటు 1989–90లో పదోతరగతి వరకు చదువుకున్న. క్రమశిక్షణ, భయం, భక్తితో కూడిన విద్యాబోధన కొనసాగేది. పాఠశాలలో వార్షికోత్సవాలు, విజేతల కథలు, ఉపాధ్యాయుల అంకితభావం.. ఇలా ఒక సాంస్కృతిక, విద్యాచైతన్య కేంద్రంగా బడి ఉండేది. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌కు జీవం పోసిన విద్యానిలయం.
– చంద్రశేఖర్, ఎకై ్సజ్ సీఐ,
రాష్ట్ర టాస్క్‌ఫోర్స్
చదువుకున్న బడిలోనే పనిచేశా
నేను ఈ బడిలో 1971–72లో పదోతరగతి చదువుకున్న. బడిలో నేర్చుకున్న అక్షరజ్ఞానంతో ఉన్నత చదువులు చదివి గెజిటెట్ ప్రధానోపాధ్యాయునిగా ఇదే పాఠశాలలో పనిచేశా. మండల విద్యాధికారిగా పనిచేశాను. చాలా సంతృప్తిగా అనిపించింది. చుట్టుపక్కల ఎక్కడా లేనప్పుడు గంభీరావుపేటలో విద్యాబోధన సాగింది.
– పురుషోత్తం, రిటైడ్డ్ ఎంఈవో, గంభీరావుపేట
ఆదరణ అలాగే ఉంది
గంభీరావుపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందే పాఠశాల నెలకొల్పబడింది. తర్వాత ఉన్నత పాఠశాలగా మారింది. చాలా మంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాసంస్థ. ప్రస్తుతానికి బడికి ఆదరణ తగ్గడం లేదు. ఇప్పుడు 257 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది.
– శ్రీనివాస్, ప్రస్తుత హెడ్‌మాస్టర్, గంభీరావుపేట

బడిపాఠం.. బతుకునేస్తం

బడిపాఠం.. బతుకునేస్తం

బడిపాఠం.. బతుకునేస్తం

బడిపాఠం.. బతుకునేస్తం