మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

మహిళల

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ చాపలమడుగు పంచాయతీ డీఓ సస్పెన్షన్‌ ఉపాధి హామీ ఈసీ సస్పెన్షన్‌ మార్కాపురం జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షునిగా శేషశయనారెడ్డి

సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్‌): సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంకలో గల జిల్లా మహిళా ప్రాంగణంలో మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్‌ మాదవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 45 సంవత్సరాల్లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు 6302733492, 9000850869 నంబర్లను సంప్రదించాలని కోరారు.

పుల్లలచెరువు: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకుగాను పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తూ ఇన్‌చార్జి కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ మరియదాసు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు 12,75,012 రూపాయలను శ్రీనివాసరావు అక్రమంగా వాడుకున్నారని డిప్యూటీ ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి, ఆ మేరకు సస్పెండ్‌ చేశారని ఎంపీడీఓ వెల్లడించారు.

మార్కాపురం రూరల్‌: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్టుగా చూపుతూ లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ(ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌) బెల్లంకొండ కిశోర్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుతం మార్కాపురం ఉపాధి హామీ పథకంలో ఈసీగా విధులు నిర్వర్తిస్తున్న కిశోర్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జోసెఫ్‌ కుమార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

మార్కాపురం టౌన్‌: ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నరేష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్ధి టి.గోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షునిగా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన ఏరువ శేషశయనారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు తనకు రాష్ట్ర కమిటీ నుంచి నియామకపత్రం అందినట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెడ్డి సంఘం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతానని పేర్కొన్న ఆయన తనకు పదవీ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ 1
1/1

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Advertisement
 
Advertisement
Advertisement