పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

ఉలవపాడు: మండల పరిఽఽధిలోని భీమవరం ఎస్సీ కాలనీకి చెందిన మేరీరోజ్‌ బంధువులు శుక్రవారం ఉలవపాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. గురువారం మేరీరోజ్‌పై కరేడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాడి కేసులో కరేడుకు చెందిన నిందితులు 41ఏ నోటీసు తీసుకోవడానికి శుక్రవారం స్టేషన్‌కు వచ్చిన సమయంలో.. భీమవరం గ్రామం నుంచి 3 ఆటోల్లో వచ్చినవారు తమ బిడ్డను అన్యాయంగా కొట్టారంటూ వాగ్వివాదానికి దిగారు. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వివాదం ప్రారంభమైంది. కాసేపటికి బయటకు వచ్చిన భీమవరం వాసులు మెయిన్‌ రోడ్‌పై ధర్నాకు దిగారు. దీంతో 15 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. కరేడుకు చెందిన మహిళ శిరీష భర్త రోజ్‌ మేరీతో కావలిలో కలిసి ఉంటున్నాడన్న కారణంతో ఈ వివాదం చోటుచేసుకుంది. గతంలో ఇదే విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినా మళ్లీ వివాదం చెలరేగింది.

Advertisement
 
Advertisement
Advertisement