పోటెత్తిన అర్జీదారులు..!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ రాజాబాబు, జేసీ ఆర్ గోపాలక్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్ధసారధి, జాన్సన్, విజయజ్యోతి, మాధురిలు అర్జీలు స్వీకరించారు.
దళితులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలి
30 ఏళ్లుగా సాగులో ఉన్న ఎస్సీలకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని వైిఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ వినతిపత్రం అందజేశారు. కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 159లో సుమారు 60 మంది ఎస్సీలకు 1989లో అప్పటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయగా, వారంతా ఆ భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని, 12 ఏళ్లక్రితం ప్రభుత్వం వ్యవసాయ బోర్లు కూడా వేసిందన్నారు. ఆ భూములను ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు.
ఇళ్ల స్థలాల పేరుతో మోసం
ఇళ్ల స్థలాలు ఇస్తామని దొంగ పట్టాలు సృష్టించి మోసం చేసి షేక్ అషాదుల్లా ఉమారునిషాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో డీఆర్‌ఓకు వినతిపత్రం ఇచ్చారు. షేక్ అషాదుల్లా ఉమరునిషా, డి.కోటరావు, కామేపల్లి అంజమ్మలు 18 మంది దగ్గర నుంచి ఇళ్ల స్థలాల పేరుతో నగదు వసూలు చేశారని, 6 నెలలుగా తిప్పుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.
వీధి కుక్కలను నియంత్రించాలి..
ఒంగోలు నగరంలో వీధి కుక్కలు నియంత్రించాలని ప్రజా సంఘాల నేతలు కలెక్టర్‌కు విన్నవించారు. నగర ప్రముఖులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రజల వందకుపైగా సంతకాలతో అర్జీ అందజేశారు.
మోంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న పంటలను కౌలు రైతుల పేరుతో నమోదు చేసి నష్టపరిహారం వారికే ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదిర్శ వి.బాలకోటయ్య ఆధ్వర్యంలో వినితపత్రం అందజేశారు. గతంలో అనేకసార్లు విపత్తులు జరిగినప్పుడు నష్టపరిహారం భూ యజమానులకే అందించడంతో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని కౌలు రైతులకు న్యాయం చేయాలన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు భారీగా అర్జీలు


