రెండు కుటుంబాల్లో విషాదం..
కురిచేడు: భార్య కాపురానికి రాలేదన్న బాధలో మనస్తాపంతో ఉన్న యువకుడు లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు మరో యువకుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..మండలంలోని ఆవులమంద పంచాయతీ ప్రతిజ్ఞాపురి కాలనీకి చెందిన గోసుల మంజు(25)కు మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే భార్య అప్పటి నుంచి కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం తన సోదరుడు ఆనంద్(15)తో కలిసి వినుకొండ వెళ్లాడు. తిరిగి ప్రయాణంలో పసుపులేరు బ్రిడ్జిపై లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆనంద్ కురిచేడు వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇద్దరు మృతితో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం ఇద్దరు మృతి
రెండు కుటుంబాల్లో విషాదం..


