
ఏకేయూలో బీఎడ్ పరీక్షల నిర్వహణ
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ 2వ సంవత్సరం మూడో సెమిస్టర్ విద్యార్థులకు 13వ తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.సోమశేఖర మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ అధికారులు 42 మంది అబ్జర్వర్లు, 3 స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే డీబార్ చేస్తున్నామని తెలిపారు. 14వ తేదీ మంగళవారం గిద్దలూరు పరిధిలో జరిగిన పరీక్షలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను స్క్వాడ్ టీం డీబార్ చేశారన్నారు. తాను సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ, శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ సెంటర్లను పరిశీలించినట్లు చెప్పారు.