సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

Oct 16 2025 4:55 AM | Updated on Oct 16 2025 4:55 AM

సాగర్

సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి 8వ పే కమిషన్‌ను నియమించాలి మరణించిన ఎకై ్సజ్‌ కానిస్టేబుళ్ల కుటుంబాలకు సాయం

తాళ్లూరు: మండలంలోని వెలుగువారిపాలెం వద్ద సాగర్‌ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన పొదిలి మండలం కాటూరివారిపాలెం వాసి మెలిక ప్రసాద్‌(48) నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. వల బయటకు లాగే క్రమంలో కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి నీటిలో పడిపోయిన ప్రసాద్‌ అదే ప్రదేశంలో పూడికలో కూరుకుపోయి మృతి చెందాడు. బంధువులతోపాటు స్థానికులు కలిసి వలల సహాయంలో కాలువ నుంచి మృతదేహాన్ని బుధవారం వెలికితీసి స్వగ్రామానికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి, వీఆర్వో చిన్నకృష్ణ పోలీసులకు సమచారం ఇవ్వటంతో సంఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ భాస్కర్‌రావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

హెడ్‌ పోస్టాఫీసు ఎదుట ఉద్యోగుల ధర్నా

మార్కాపురం టౌన్‌: కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8వ పే కమిషన్‌ సభ్యులను నియమించాలని రాష్ట్ర అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం సహాయ కార్యదర్శి ఎన్‌.రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం మార్కాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలిండియా జనరల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ మహదేవయ్యను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తొలగించారని, ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్‌ఎఫ్‌పీఈ కార్మిక సంస్థ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు డి.నారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎ.రవి, కార్తీక్‌, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు టౌన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎకై ్సజ్‌ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాసరావు, డి.సుబ్బారావు కుటుంబ సభ్యులకు సహచర ఉద్యోగులు సాయం అందించారు. జిల్లాలోని కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్ల నుంచి ఫండ్‌ సేకరించి ఒక్కో కుటుంబానికి రూ.74 వేల చొప్పున ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు చేతుల మీదుగా బుధవారం స్థానిక ఎకై ్సజ్‌ డీసీ కార్యాలయంలో అందజేశారు. సహృదయంతో సాటి ఉద్యోగుల కుటుంబాలకు చేయూతనివ్వాలన్న ఆలోచన చేసిన అసోసియేషన్‌ నాయకులకు ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అభినందించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ ఆయేషా బేగం, ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జనరల్‌ సెక్రటరీ ఎస్‌.శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సాగర్‌ కాలువలో  గల్లంతైన వ్యక్తి మృతి 
1
1/2

సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

సాగర్‌ కాలువలో  గల్లంతైన వ్యక్తి మృతి 
2
2/2

సాగర్‌ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement