
నేడు ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన
పెద్దదోర్నాల: నేడు శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేట్టారు. గ్రేహాండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం శ్రీశైలం ఘాట్‌రోడ్డులో అడుగడుగునా తనిఖీ చేశారు. బందోబస్తుకు హాజరైన పోలీసు సిబ్బందికి ముందుగా పెద్దదోర్నాల పోలీస్‌స్టేషన్ వద్ద మార్కాపురం డీఎస్పీ నాగరాజు దిశానిర్దేశం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, శ్రీశైలం నుంచి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. లైసెన్స్, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, మద్యం తాగిన వాహనదారులను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులోకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించేది లేదని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్‌రావు, పలువురు ఎస్సైలు ఉన్నారు.
శ్రీశైలం వచ్చి వెళ్లే వాహనాలు ముమ్మరంగా తనిఖీ
భద్రతా చర్యలను పర్యవేక్షించిన మార్కాపురం డీఎస్పీ
గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాల నిలిపివేత