
చచ్చినా చావే..!
కంభం: మండలంలోని రావిపాడు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తున్న సమయంలో ఊర్లో ఎవరైనా చనిపోతే నడుముల లోతుకు పైగా నీటిలో అడుగులో అడుగేస్తూ పాడె మోయాల్సిన దుస్థితి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన అంజిరెడ్డి(54) బుధవారం మృతి చెందారు. శ్మశానానికి వెళ్లే మార్గంలో గుండ్లకమ్మ వాగులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మృతుడి బంధువులు, గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. వాగు అవతల ఉన్న పంటపొలాలకు వెళ్లడానికి కూడా తిప్పలు తప్పడం లేదని, అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

చచ్చినా చావే..!