నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి

Oct 16 2025 4:55 AM | Updated on Oct 16 2025 4:55 AM

నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి

నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి

నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ చేయించాలి టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే నకిలీ మద్యం వ్యాపారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ: నకిలీ, కల్తీ మద్యం వ్యాపారంతో పేద ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించి ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, ఈ అక్రమ వ్యాపారంపై సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో బుధవారం కల్తీ మద్యం వ్యవహారంపై దోషులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ సందర్భంగా పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ప్రధాన రహదారి గుండా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వెంకట్‌, సీఐ ఎం.శివకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ కల్తీమద్యంపై ముఖ్యంగా 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌షాపులు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటి వరకు పత్రికల కథనాల ప్రకారం సుమారు 421 మందికి పైగా నకిలీ మద్యం కారణంగా మృత్యువాత పడ్డారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వైన్‌ షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించి అనర్హులను తొలగించాలన్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుని అమ్మకం వేళలు తగ్గించాలని కోరారు. బడులు, దేవాలయాలకు సమీపంలో, పబ్లిక్‌ స్థలాల్లో ఏర్పాటు చేసిన వైన్‌షాపులు, బార్ల లైసెన్స్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశామన్నారు.

టీడీపీ కనుసన్నల్లో నకిలీ మద్యం వ్యాపారం:

రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం వ్యాపారం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని ఇందుకు పూర్తి ఆధారాలు బట్టబయలయ్యాయని డాక్టర్‌ సురేష్‌ ఆరోపించారు. నెల్లూరు, విజయవాడ, ఏలూరు, పాలకొల్లు, పరవాడ తదితర ప్రాంతాలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బట్టబయలయ్యాయన్నారు. నకిలీ మద్యం వ్యవహారం తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, అనుచరుడు జనార్దనరావు కనుసన్నల్లో జరిగిందని వీరందరూ టీడీపీ వారే కదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆఫ్రికాలో మద్యం డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు రూ.5,300 కోట్లు నకిలీ మద్యం వ్యాపారం ద్వారా దోచుకున్నారని ఇంతటి భారీ అక్రమ వ్యాపారం బట్టబయలు చేసి దోషులకు శిక్ష పడాలంటే రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండే సిట్‌ కాదని, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్‌ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టిందని ఈరోజు నకిలీ మద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి ప్రాణాలను హరించిందని, ఇందుకు ముమ్మాటికీ టీడీపీ నాయకులే కారకులని విమర్శించారు. ర్యాలీ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వరరావు, ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, కనపర్తి శేషారెడ్డి, తానికొండ రామచంద్రరావు, రాపూరి ప్రభావతి, షేక్‌ సుల్తాన్‌, పఠాన్‌ రియాజ్‌, చొప్పర వెంకన్న, కనపర్తి గోవిందమ్మ, యనమల మాధవి, చుక్కా కిరణ్‌కుమార్‌, దాసు శ్రీను, షేక్‌ కరీం, గొల్లపోతు గోవర్దన్‌, మిరియం సుధాకర్‌, గాదంఽశెట్టి గుప్తా, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కోమిట్ల వెంకారెడ్డి, నరేష్‌, షేక్‌ అల్లాభక్షు, నాగార్జున, భాను, నవీన్‌రెడ్డి, బుజ్జమ్మ, చిడిపూడి కృష్ణారెడ్డి, చిమట శ్రీను, చామల ఉదయశంకరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, దేవరపల్లి వరుణ్‌, బత్తిన మనోహర్‌రావు, దగ్గుమాటి శంకరరెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ముప్పా కోటేశ్వరరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టి రవీంద్రరెడ్డి, వై వీర వసంతరావు, పూనూరి సంజీవరెడ్డి, సోమిశెట్టి సురేష్‌, బల్లెల ప్రభాకరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, కాళహస్తి వెంకారెడ్డి, పురిణి దేవ, గాలి బుజ్జి, దాసరిశేషయ్య, సాయికోటి, మాదాల శంకర్‌, అంకయ్య, కాకి జయపాల్‌, వాయిల పున్నయ్య, శివారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement