పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి

Oct 17 2025 5:52 AM | Updated on Oct 17 2025 5:52 AM

పొలం

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి ఇష్టారాజ్యంగా మట్టి వ్యాపారం

గిద్దలూరు రూరల్‌: తమ పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఓ బాలింత తన భర్త రెడ్యానాయక్‌, పసిబిడ్డతో కలిసి స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద గురువారం ఆవేద వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ కథనం మేరకు.. దిగువమెట్ట తండాకు చెందిన కాండ్రావత్‌ లక్ష్మీబాయ్‌ జేజినాయన బుక్కె మంగ్యానాయక్‌కు అంబవరం రెవెన్యూ ఇలాకాలో 1962లో అప్పటి ప్రభుత్వం 3.38 ఎకరాల భూమి మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు తమ వద్ద లేకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయంలో విచారించగా రికార్డులో వివరాలు నమోదై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న భూమిని ఆరేళ్ల క్రితం జయరాంపురం తండాకు చెందిన కరిమయ్య, అతని కుమారుడు గురవయ్య ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దీంతో పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. పొలం ఆక్రమించిన వారిని అప్పటి తహసీల్దార్‌ సీతారామయ్య పిలిపించి హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన కరిమయ్య మళ్లీ భూమిలోకి ప్రవేశించాడు. నకిలీ పత్రాలు చూపుతూ తమను భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై తహసీల్దార్‌ ఎం.ఆంజనేయరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని కొనడం, అమ్మడం నేరమని, వెంటనే వారిని పిలిచి విచారించి న్యాయం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

కంభం: కొండలు, తిప్పల వెంట ఇష్టానుసారంగా మట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నా సంబంధింత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల మద్దతుతో అక్రమార్కులు సాగిస్తున్న మట్టి దందాను అడ్డుకునేందుకు ఏ అధికారీ ధైర్యం చేయడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అర్ధవీడు మండలంలోని నాగులవరం కొండ, కంభం మండలంలోని చిన్నకంభం, ఎల్‌కోట గ్రామాల వద్ద ఉన్న కొండలను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రాక్టర్‌ ట్రక్కు మట్టిని రూ. 700కు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, గృహాలు నిర్మించుకునే వారు చేసేదేమీ లేక వారు చెప్పినంత సొమ్ము చెల్లించి తమ అవసరాల కోసం మట్టిని తోలుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు కొండల్లో మట్టి తోలే వారి వద్ద ఒక్కో ట్రాక్టర్‌కు రూ.100 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మట్టి దందాపై మౌనంగా ఉంటున్న అధికార యంత్రాంగం.. పరిస్థితిని బట్టి హడావిడి చేస్తుండటం చర్చనీయాంశమైంది.

ట్రాక్టర్‌ మట్టి రూ.700 కూటమి నేతల వాటా రూ.100

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి1
1/2

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి2
2/2

పొలం ఆక్రమించారు.. న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement