
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
గిద్దలూరు రూరల్: మండలంలోని దిగువమెట్ట గ్రామ నల్లమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..కర్నూలు నుంచి విజయవాడ వెళుతున్న లారీ..ప్రమాదవశాత్తు నల్లమల్ల ఘాట్ రోడ్డు మలుపు వద్ద పాత బ్రిడ్జిని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ బి.రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుగా నిలిచిపోవడంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. దీంతో సుమారు 6 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ రాజు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు కర్నూలుకు చెందిన వాడిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాత బ్రిడ్జిని ఢీకొని రోడ్డుకు అడ్డంగా
నిలిచిన లారీ
6 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్