
కలెక్టర్‌ను కలిసిన జైళ్ల శాఖ డీఐజీ
ఒంగోలు సబర్బన్: జైళ్ల శాఖ గుంటూరు డీఐజీ డాక్టర్ ఎం.వర ప్రసాద్ కలెక్టర్ పీ.రాజా బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్‌ను కలిసిన ఆయన పూల మొక్కను బహూకరించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన జైలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర జైళ్లకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై సంబంధిత అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 25 మండలాల్లో 185 రైతు సేవా కేంద్రాల పరిధిలో మొత్తం 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన రవాణా, హమాలీలు, గోనె సంచులను, తేమ శాతం కొలిచే యంత్రాలను ముందుగా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ నుంచి వరి ధాన్యం కోతల ప్రారంభమవుతాయని, నవంబరు మాసాంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌కేలతో మ్యాపింగ్, రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని తెలిపారు. పౌర సరఫరాల అధికారులు మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీలను తీసుకోవడం, అన్ని మిల్లులు పని చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం, సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ,, పౌరసరఫరాల శాఖ డీఎం వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడీ వరలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన జైళ్ల శాఖ డీఐజీ