
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఆరుగురు ఎంపిక
టంగుటూరు: అండర్ 19 బాల బాలికల టెన్నికాయిట్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు మండలంలోని ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు వాక వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సింగరాయకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో బాలుర విభాగంలో ఆర్ కార్తికేయ, వెంకట నాగ ఫణీంద్ర, ఏ.గోపీచంద్, బాలికల విభాగంలో వి.భవ్యశ్రీ,, పి.జాహ్నవి, బి.జేసిన్మాయి ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల పీడీ పి.వెంకట్రావు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లా స్థాయి హాకీ ఎంపికలు ప్రారంభిస్తున్న డీఈవో ఏ.కిరణ్ కుమార్
సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్ 14, 17 బాలబాలికల జిల్లా హాకీ జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికను డీఈవో ఏ.కిరణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లలో పాల్గొంటారని జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ చెక్కా వెంకటేశ్వర్లు, ఏ.శిరీష తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు డి.శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రవికుమార్, ఎంఈఓ వెంకారెడ్డి, హెచ్‌ఎంలు డీవీఎల్ నరసింహారావు, ఆళ్ల వెంకటేశ్వర్లు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, ఎస్జీఎఫ్ సెక్రటరీస్ వెంకటేశ్వర్లు, శిరీష, హనుమాన్ చారి, డైట్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఆరుగురు ఎంపిక