
మేమెందుకు నడుస్తున్నామంటే..
పొదిలి రూరల్: పొదిలి మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థులు గురువారం నడుస్తూ.. నానాతంటాలు పడుతూ పాఠశాలకు చేరుకున్నారు. కర్నూలులో ప్రధాని మోదీ సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులను అధిక సంఖ్యలో తరలించడంతో స్థానికంగా ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థులు భుజాన బ్యాగుల మోతతో సుమారు 5 కి.మీ నడిచి పొదిలిలోని ప్రభుత్వ పాఠశాలకు అతి కష్టమ్మీద చేరుకున్నారు. అధిక చార్జీ చెల్లించి ఆటోలు ఎక్కలేక కాళ్లకు పనిచెప్పారు.

మేమెందుకు నడుస్తున్నామంటే..