
శానిటేషన్ పరిశీలించిన డీపీఓ
సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులో మంగళవారం శానిటేషన్, ఓహెచ్‌ఎస్‌ఆర్, తాగునీటి ట్యాంకు, ఎస్ డబ్ల్యూపీసీ కేంద్రం, గార్బేజ్ కలెక్షన్, స్వామిత్వ సర్వేలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పరిశీలించారు. వాటర్ ట్యాంక్ వద్ద ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా వాటర్ టెస్టింగ్ చేయించారు. 15 రోజులకు ఒకసారి ఓహెచ్ ఎస్‌ఆర్ ట్యాంకును క్లీన్ చేయాలని డీపీఓ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రం చేయించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో డి.సురేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్ మధుసూదన్‌రావు, పంచాయతీ కార్యదర్శి ఎన్.ప్రతాప్ కుమార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ చక్రధర్, నియోజకవర్గ రిసోర్స్ పర్సన్ జయశంకర్, గ్రామపంచాయతీ ప్రతినిధులు బాబురావు, శిఖామణి, పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు.