
అక్రమ కేసులు ఎత్తివేయాలి
మార్కాపురం: సాక్షి దినపత్రికపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వార్తలు రాశారన్న కక్షతో కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పత్రికా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, అంతేగానీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. పత్రికా కార్యాలయాలకు వెళ్లి పోలీసులు సోదాలు చేయడం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు.
ఒంగోలు: ఫెన్సింగ్ అండర్ – 14 జిల్లా క్రీడాకారులను గురువారం స్థానిక మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ ఆధ్వర్యంలో ఫాయిల్, ఈపీ, సాబ్రే విభాగాలలో ఎంపిక జరిగింది. ఈపీ విభాగంలో బాలబాలికలు ఎంపికవగా, ఫాయిల్, సాబ్రే విభాగాలలో బాలురు మాత్రమే ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 18 నుంచి కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిఽథ్యం వహిస్తారని నవీన్ తెలిపారు.
ఫాయిల్ విభాగంలో ఎంపికై న బాలురు : జి.తనీష్, జె.జగదీశ్వర్, కె.భవేష్, డి.రాహుల్
ఈపీ విభాగంలో ఎంపికై న బాలురు : జె.సాయిచరణ్, డి.చరణ్ సాయి ఫణీశ్వర్, సీహెచ్ జ్ఞానేశ్వర్, టి.లలిత్ చౌదరి
ఈపీ విభాగంలో బాలికలు : బి.సౌమ్యశ్రీ, డి.ప్రియ, టి.మృధుల, సీహెచ్ జైత్రశ్రీ
సాబ్రే విభాగంలో బాలురు : షేక్ అయాన్ మహీబ్, డి.రోహిత్, దేవాన్ష్

అక్రమ కేసులు ఎత్తివేయాలి