పైసలిస్తేనే ప్యాకేజీ.! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే ప్యాకేజీ.!

Oct 17 2025 7:47 AM | Updated on Oct 17 2025 7:47 AM

పైసలిస్తేనే ప్యాకేజీ.!

పైసలిస్తేనే ప్యాకేజీ.!

వెలిగొండ నిర్వాసితుల నుంచి వసూళ్ల పర్వం మొదలు ఒక్కొక్క కుటుంబం రూ.20 వేలు చెల్లించాలని ఒత్తిడి సగం కూటమి నాయకుడికి, సగం టీడీపీ వర్గీయులకు

యర్రగొండపాలెం: డబ్బులిస్తేనే ప్యాకేజీ మంజూరు చేయిస్తామని వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబం రూ.20 వేల చొప్పున చెల్లిస్తే వెంటనే ప్యాకేజీ మంజూరవుతుందని ప్రచారం మొదలు పెట్టడంతో పాటు కొంతమంది వద్ద డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలైన సొత్తు నుంచి కూటమి నాయకుడికి రూ.10 వేలు, మిగిలిన రూ.10 వేలలో స్థానిక నాయకులు, అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని వారు వివరిస్తునట్లు తెలిసింది. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాలకు చెందిన మొత్తం నిర్వాసిత కుటుంబాలు 5,126 ఉన్నాయి. వాటిలో 3,760 కుటుంబాలు అవార్డు పొందగా, 1,360 కుటుంబాల జాబితాను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వీరి నుంచి దాదాపు రూ.10 కోట్లు వసూలు చేసేందుకు పచ్చ నాయకులు పూనుకున్నారు. డబ్బు వసూళ్ల పర్వం బహిరంగంగానే జరుగుతోందని ఆయా ప్రాంతాల నిర్వాసితులు చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ కోసం తమ సొంత గ్రామాలను వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్యాకేజీ కోసం ఎదురు చూస్తుంటే.. టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. సుంకేసుల పంచాయతీలో 2756 కుటుంబాలు ఉండగా, 1,900 అవార్డు పొందారు. 856 పెండింగ్‌లో ఉన్నాయి. కలనూతల పంచాయతీలోని 1,170 కుటుంబాలలో 1,030 అవార్డులు పొందగా, 140 కుటుంబాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా గుండంచర్ల పంచాయతీలో 1,200 కుటుంబాలలో 830 అవార్డు పొందగా, 370 కుటుంబాలవి పెండింగ్‌లో ఉంచారు. అవార్డు పొందిన వారితో పాటు పెండింగ్‌లో ఉన్న కుటుంబాలకు కూడా వెంటనే ప్యాకేజీ మంజూరు చేయిస్తామని పచ్చనేతలు అక్రమ వాసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాల నుంచి తమను కాపాడాలని నిర్వాసితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement