
వాహనదారులకు అందని సేవలు...
టోల్ ప్లాజాల్లో వాహనదారులకు సేవలందించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1033 ఉంది. దానికి వాహనదారులు ఫోన్ చేస్తే సిబ్బంది స్పందించరు. టోల్ ప్లాజా పెట్రోలింగు వాహనం ఎక్కడ ఉంటుందో తెలియదు. వారి పర్యవేక్షణ కొరవడటంతో రాత్రి పూట లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆయిల్ దొంగలు అదే అదునుగా చూసుకుని లారీ ట్యాంకుల్లో డీజిల్ కాజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే జాతీయ రహదారి అంబులెన్సులో ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు ఉండవు. అధికారులు ఇస్తున్నా ఆంబులెన్సు సిబ్బంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యులు, సిబ్బంది లేరని, వాటిని అలంకార ప్రాయంగా సింగరాయకొండలోని కలికవాయి వద్ద ఉంచుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.