
కేసు నమోదు చేయాలంటూ ఆందోళన
మార్కాపురం: లారీ డ్రైవర్‌ను కొట్టిన ఓనర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ తరఫు వారు సోమవారం మార్కాపురం పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పట్టణంలోని సుందరయ్యకాలనీలో నివాసముండే లారీ డ్రైవర్ నారాయణ మద్యం తాగాడని మూడు రోజుల క్రితం చీమకుర్తికి చెందిన లారీ ఓనర్ మర్రిచెట్లపాలెం సమీపంలో తీవ్రంగా కొట్టాడు. దీంతో పొదిలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నారాయణ చికిత్స పొందాడు. ఈ సంఘటనకు సంబంధించి లారీ ఓనర్‌పై మార్కాపురం పోలీసుస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకుడు రూబెన్, మరికొంత మంది సుందరయ్యకాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ విధులను అడ్డుకోవద్దంటూ ఎస్సై సైదుబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంతసేపు స్వల్ప ఉద్రిక్తత కూడా నెలకొంది. సీపీఎం నాయకుడు రూబెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీపీఎం నాయకుడు రఫీ, తదితరులు స్టేషన్‌కు చేరుకుని మాట్లాడారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. కాగా, మార్కాపురం పట్టణ ఎస్సై తన విధులకు ఆటంకం కలిగించారంటూ సీపీఎం నాయకుడు రూబెన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేసిన దేవరాజు, మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.