● ఎస్పీ ఏఆర్ దామోదర్
దర్శి: అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు శనివారం దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామానికి వస్తున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. హెలీప్యాడ్, వీఐపీ వాహనాల రూట్, పార్కింగ్ ఏరియా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం పర్యటనను డ్రోన్ కెమెరాలు, సీపీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎస్పీ వెంట దర్శి, ఒంగోలు, మార్కాపురం డీఎస్పీలు లక్ష్మీనారాయణ, ఆర్.శ్రీనివాసరావు, యు.నాగరాజు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, దర్శి, త్రిపురాంతకం సీఐలు, ఎస్సైలు ఉన్నారు.