రెంటు బడి.. ‘వంట’బడి! | - | Sakshi
Sakshi News home page

రెంటు బడి.. ‘వంట’బడి!

Jul 31 2025 6:58 AM | Updated on Jul 31 2025 9:06 AM

రెంటు

రెంటు బడి.. ‘వంట’బడి!

సమస్యల మధ్య కొనసాగుతున్న బాలల విద్య
ఇలాగైతే చదువు ‘వంట’బట్టేనా?

ప్రభుత్వ పాఠశాలలకు పేద విద్యార్థులను క్రమంగా దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడుల్లో కనీస మౌలిక సదుపాయాలు

కల్పించకుండా విద్యార్థులతోపాటు

ఉపాధ్యాయులను సైతం పాలకులు ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై

విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ

పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఇటీవల మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటలను ఉటంకించిన సీఎం

చంద్రబాబునాయుడు, విద్యాశాఖ

మంత్రి లోకేష్‌ ఆ దిశగా గత ఏడాది కాలంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో అద్దె భవనాల్లో, పాఠశాల

వంటగదుల్లో అరకొర వసతుల మధ్యే విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి. మనబడి నాడు–నేడు పనులకు మంగళం పాడిన కూటమి సర్కారు విద్యాభివృద్ధిపై కపట ప్రేమ చూపుతోందనేందుకు జిల్లాలోని పలు పాఠశాలలు

తార్కాణంగా నిలుస్తున్నాయి.

మార్కాపురం సుందరయ్య కాలనీలో పాఠశాల

ఆగిన నిర్మాణం..

దికై ్కన అద్దె భవనం

బేస్తవారిపేట: స్థానిక ఇస్లాంపేటలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఏడేళ్ల క్రితం ఉరుఊ్ద పాఠశాల రెండు తరగతి గదులు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండటంతో అధికారులు పడగొట్టారు. సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో నూతన గదులను బేస్‌మెంట్‌ వరకు నిర్మించిన కాంట్రాక్టర్‌ బిల్లులు రాలేదని మధ్యలోనే వదిలేశాడు. అప్పటి నుంచి పాఠశాలను ఇస్లాంపేటలో ఓ అద్దె ఇంట్లో నడుపుతున్నారు. ప్రతి నెలా ఉపాధ్యాయులే అద్దె, కరెంట్‌ బిల్లు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 28 మంది చదువుకుంటున్నారు. వసతులు లేకపోవడం, ఇరుకు గదుల్లో పాఠాలు చెప్పాల్సి రావడంతో కొందరు తల్లిదండ్రులు టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. నాడు–నేడు మొదటి విడతలో ఎంపికై న ఈ పాఠశాలలో టాయిలెట్స్‌ నిర్మించారు. బెంచీలు, స్మార్ట్‌ టెలివిజన్‌ ఇవ్వగా వసతి లేక మూలన పెట్టారు. అసంపూర్తి భవనానికి నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మొండి గోడలు.. చిల్లుల రేకులు

మార్కాపురం టౌన్‌: మార్కాపురం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరయ్య కాలనీలో ప్రాథమికోన్నత పాఠశాల అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య నడుస్తోంది. ఈ కాలనీలో రోజూ పనికెళ్లి పొట్టపోసుకునే కూలీలే అధికం. వేల రూపాయల ఫీజులు కట్టి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అందరూ మొగ్గుచూపుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 63 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 2 గదులు, వరండా మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో వంటశాల ఉండగా, మరో గదిలో 1, 2 తరగతుల విద్యార్థులు కూర్చుంటున్నారు, వరండాలో 3, 4, 5, తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. వరండా మొత్తం రేకులతో కప్పి ఉంది. రేకులు శిథిలావస్థకు చేరి చిల్లులు పడటంతో వర్షం కురిసినపుడు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. నేలపై కూర్చోవడం, వీధి కుళాయి వద్ద నీరు తెచ్చుకుని తాగడం, ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవడం ఇక్కడి విద్యార్థులకు అలవాటు చేసినట్టుగా కనిపిస్తోంది. బయట నుంచి చూసేవారికి ఇక్కడ ఓ పాఠశాల ఉందని కూడా తెలియడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మార్కాపురం సుందరయ్య కాలనీలో అద్దె ఇంట్లో మొండిగోడల మధ్య విద్యా బోధన

కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు ఏఏ పాఠశాలలో వంట గదిలో తరగతులు

బేస్తవారిపేటలో నిధులివ్వకపోవడంతో నిలిచిన ఉర్దూ పాఠశాల నిర్మాణం

బెంచీలకు సైతం దిక్కులేక నేలపైనే కూర్చుంటున్న విద్యార్థులు

కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యం

కొనకనమిట్ల: మండలంలోని బచ్చలకూరపాడు ఎస్సీ కాలనీలో మండల పరిషత్‌ ఏఏ పాఠశాలలో నాడు–నేడు పనులు నిలిచిపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. రెండో విడతలో భాగంగా చేపట్టిన నూతన పాఠశాల నిర్మాణ పనులు శ్లాబ్‌ దశ వరకు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం రాగానే పనులు నిలిపేయడంతో పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న 24 మంది విద్యార్థులను వంట గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అయితే ఇరుకు గదిలో కూర్చోలేక కొందరు పిల్లలు బయటకు వెళ్లి ఆటలాడుకుంటున్నారు. పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామ సర్పంచ్‌ మెట్టు రమణమ్మ, ఆమె భర్త వైస్‌ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల బదిలీలకు ముందు వరకు పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. శ్రీవిద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామ’ని ఎంఈఓ–2 నరసింహారావు చెప్పారు.

రెంటు బడి.. ‘వంట’బడి! 1
1/5

రెంటు బడి.. ‘వంట’బడి!

రెంటు బడి.. ‘వంట’బడి! 2
2/5

రెంటు బడి.. ‘వంట’బడి!

రెంటు బడి.. ‘వంట’బడి! 3
3/5

రెంటు బడి.. ‘వంట’బడి!

రెంటు బడి.. ‘వంట’బడి! 4
4/5

రెంటు బడి.. ‘వంట’బడి!

రెంటు బడి.. ‘వంట’బడి! 5
5/5

రెంటు బడి.. ‘వంట’బడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement