
కంభం: ఈనెల 17వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బృందావన కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ శైలేంద్రనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలని కోరారు.
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు
దర్శి: ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనుబంధ సంస్థ దర్శి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అగ్రిసెట్ లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచారు. విద్యార్థులైన మహానంది హర్షిణికి 37వ ర్యాంకు, నాగేశ్వరికి 80వ ర్యాంకు, ఎస్‌డీ హరిఫ్‌కు 124వ ర్యాంకు, వేము తేజస్వినికి 163వ ర్యాంకు, బ్యూలాకు 217 ర్యాంకు వచ్చింది. విద్యార్థులకు దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ బీ ప్రమీలా రాణి అభినందనలు తెలిపారు.
పెద్దదోర్నాల సబ్ డీఎఫ్‌ఓగా వేణు
పెద్దదోర్నాల: పెద్దదోర్నాల సబ్ డీఎఫ్‌ఓగా ఆత్మకూరి వేణు బుధవారం బాధ్యతలు చేపట్టారు. మార్కాపురం ఫారెస్టు రేంజి అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన సబ్ డీఎఫ్‌ఓగా పదోన్నతి పొందారు. గతంలో పెద్దదోర్నాల సబ్ డీఎఫ్‌ఓ గా బాధ్యతలు నిర్వహించిన సందీప్‌రెడ్డి కడప జిల్లాకు డిప్యూటీ డైరక్టర్‌గా బదిలీపై వెళ్లగా, ప్రస్తుతం ఆత్మకూరి వేణు సబ్ డీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. వేణుకు కొర్రప్రోలు, దోర్నాల రేంజి అధికారులు ప్రసన్నజ్యోతి, విశ్వేశ్వరరావు అభినందనలు తెలిపారు.
మార్కెట్ యార్డు చైర్మన్‌గా నాగమణి ప్రమాణ స్వీకారం నేడు
త్రిపురాంతకం: యర్రగొండపాలెం మార్కెట్ యార్డు చైర్మన్‌గా శింగారెడ్డి నాగమణి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేడు వైఎస్సార్ సీపీకి చెందిన మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. వీరి స్వాగత ఏర్పాట్లు భారీగా చేశారు. త్రిపురాంతకంలో ఈమేరకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ మండల పార్టీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి భార్య నాగమణిని ప్రభుత్వం చైర్ పర్సన్‌గా నియమించింది. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన యాదవ్, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నేడు ఎంపీపీగా వెంకటయ్య అధికారిక ఎన్నిక
పుల్లలచెరువు: నేడు ఎంపీడీవో కార్యాలయంలో జరగనున్న పుల్లలచెరువు ఎంపీపీ ఎన్నిక సందర్భంగా యర్రగొండపాలెం లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీటీసీ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా కందుల వెంకటయ్యను ఎంపిక చేసి పార్టీ బీ ఫారం అందజేశారు. సభ్యులంతా పార్టీ నిబంధనలకు లోబడేలా విప్ జారీ చేసే అధికారాన్ని మల్లాపాలెం ఎంపీటీసీ ఎల్ రాములుకు ఇస్తూ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి నుంచి అందిన నకలును మంత్రి సురేష్ రాములుకు అందచేశారు.
కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఎం, సుబ్బారెడ్డి, యండ్రపల్లిస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ అభ్యర్థి వెంకటయ్యకు బీ ఫారం అందజేస్తున్న మంత్రి సురేష్

ఆత్మకూరి వేణు