టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల

YSRCP Sajjala Ramakrishna Reddy Slams TDP Over Pattabhi Comments - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు.

ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం జగన్‌ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు. 
(చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి)

‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.
(చదవండి: చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని )

‘‘టీడీపీ డీఎన్‌ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహానానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు. 

చదవండి: ‘పట్టాభి ఓ గే’.. 'సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top