‘పవన్‌ సీజ్‌ ద షిప్‌’ ఏమైంది!? | YSRCP MLCs Serious Comments On CBN Govt And Pawan | Sakshi
Sakshi News home page

‘పవన్‌ సీజ్‌ ద షిప్‌’ ఏమైంది!?

Sep 25 2025 7:09 AM | Updated on Sep 25 2025 7:10 AM

YSRCP MLCs Serious Comments On CBN Govt And Pawan

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, సూర్యనారాయణ ఫైర్‌

మండలిలో పలు సమస్యలు ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడలో బియ్యం తరలిస్తున్న షిప్‌ను సీజ్‌ చేయాలని, సీజ్‌ ద షిప్‌ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ డిమాండ్‌ చేశారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దంపడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల కేంద్రంగా పెద్దఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందన్నా­రు. మరో ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. పౌర సరఫరాలు, పోలీసు  శాఖలోని కొందరు రేషన్‌ మా­ఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.

అనంతరం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దుచేశామన్నారు. గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడా­ది ఆగస్టు వరకు  2,438 కేసులు నమోదుచేసి 5 లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా«దీనం చేసుకున్నామని చెప్పా­రు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వ దాట­వేత ధోరణి సరికాదన్నారు. తూమాటి మాధవరావు మా­ట్లా­డుతూ లులుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్ర­­శ్నించారు. కల్పలతారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన మెడికోలను శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement