YSRCP MLA Malladi Vishnu Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి’

Apr 25 2023 5:50 PM | Updated on Apr 25 2023 6:23 PM

Ysrcp Mla Malladi Vishnu Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడమే చంద్రబాబు పని అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళితులను అవమానించేలా మాట్లాడుతున్నారని, వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘కర్షకులు, రైతులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు అన్ని వర్గాలు మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కోటి గృహాలకు వెళ్తే 80 లక్షల మిస్డ్ కాల్స్‌ ఇచ్చారు. మెగా సర్వేలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ చూశాక చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తన క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ తప్ప చంద్రబాబుకు ఏమీ అక్కర్లేదు’’ అని ఎమ్మెల్యే మల్లాది నిప్పులు చెరిగారు.
చదవండి: రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్‌

‘‘మురుగునీరు, డ్రైనేజీపైనా పన్ను వేసిన వ్యక్తి చంద్రబాబు. పేదలంటే చంద్రబాబుకు చులకన. ఆయన చెప్పేది వినలేక జనం పారిపోతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా మేము జగన్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. జగన్ పరిపాలనా దక్షత ప్రజలకు అర్థం అయ్యింది’’ అని మల్లాది విష్ణు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement