టీడీపీ హయాంలో డ్రగ్స్‌ మాఫియా కనిపించలేదా..? | YSRCP MLA Adeep Raj Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో డ్రగ్స్‌ మాఫియా కనిపించలేదా..?

Oct 27 2021 12:00 PM | Updated on Oct 27 2021 12:06 PM

YSRCP MLA Adeep Raj Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖ జిల్లా: టీడీపీ కష్టాల్లో వున్నప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ తెరపైకి వస్తారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో విశాఖ డ్రగ్స్‌ మాఫియా కనిపించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు జరిగినట్లు అప్పటి మంత్రి గంటానే అంగీకరించారన్నారు.

(చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ, అమిత్‌ షా

టీడీపీ హయాంలో భారీగా గంజాయి అమ్మకాలు: కరణం ధర్మశ్రీ
విశాఖలో గంజాయి తాగేవాళ్లే లేరని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చంద్రబాబు సిగ్నల్‌ ఇవ్వగానే పవన్‌ డ్రగ్స్‌పై ట్వీట్‌ పెట్టాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే భారీగా గంజాయి అమ్మకాలు జరిగాయన్నారు.

చదవండి: పచ్చదళం దుష్ప్రచారం

Advertisement
 
Advertisement
Advertisement