సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులపై వైఎస్సార్‌సీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి ఖరారయ్యారు. ఇవాళ మిగిలిన మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న (సోమవారం) పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలే అజెండాగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేసి దిశానిర్దేశం చేశారు. పార్టీకి ప్రతి అనుబంధ విభాగం కీలకమన్నారు. అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు.
ఇదీ చదవండి: మున్సిపోల్స్‌కు రె'ఢీ'


