Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Telugu News Breaking News Sakshi Latest News 2nd November 2022

1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్‌.. స్పందించిన బండి
దొంగ పాస్‌పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్‌ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్‌ఎస్‌ నేతలకు అధిష్టానం ఆదేశం
ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్‌ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని కల్పించడం సబ్‌ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్‌ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు
రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. గుర్తింపుకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్‌ ధామ్‌.. మరో జలియన్‌ వాలాబాగ్‌
ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్‌ ప్రాంతమది. బ్రిటిష్‌ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్‌ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల  ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్‌ చీఫ్‌ యూన్‌ హీ క్యూన్‌
రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్‌ చీఫ్‌ యూన్‌ హీ క్యూన్‌ అంగీకరించారు. హాలోవిన్‌ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. జాబ్‌ మానేయ్‌!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్‌లోకి వెళ్లి..
ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్‌ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్‌!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్‌ను త్యాగం చేసేస్తుంది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Elon Musk క్లారిటీ: బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు ఎంతో తెలుసా?
బిలియనీర్‌, టెస్లా సీఈవో, ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌  బ్లూ టిక్‌ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు.  మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌లో యూజర్లు తమ  బ్లూ టిక్‌ను నిలుపు కోవాలన్నా, కొత్తగా బ్లూటిక్‌ కావాలన్నా  ఇక చెల్లింపులు  చేయాల్సిందే. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్‌
ఆడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అంచనా వేసింది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌మేట్స్‌ అంతా ఇనయాను టార్గెట్‌ చేశారు. ఆమె పర్సనల్‌ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top