తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ కీలక భేటీ

Telangana Congress Screening Committee Meeting Updates - Sakshi

కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుపై చర్చ

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది.

ఈ సమావేశానికి స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌,   టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్‌.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. 

‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top