
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వారి పార్టీలో చేరారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి పలువురు నేతలు వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్ కుమార్.. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్ వారి పార్టీలను వీడి.. వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలినట్టు అయ్యింది.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో పీజీ రాంపుల్లయ్య యాదవ్ (కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి), మోనికా రెడ్డి (51 డివిజన్ టీడీపీ కార్పొరేటర్), నరసింహులు యాదవ్ (స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్), లోక్‌నాథ్ యాదవ్ (డీసీసీబీ బ్యాంక్ మాజీ డైరెక్టర్), ప్రదీప్ వెంకటేష్ యాదవ్ (మాజీ రైల్వే బోర్డ్ మెంబర్), షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ (8వ డివిజన్ టీడీపీ నాయకులు), పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు సిటీ వైఎస్సార్‌సీపీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
