బీజేపీకి భయపడుతున్న కేసీఆర్‌ 

Tammineni Veerabhadram Comments On CM KCR  - Sakshi

అందుకే కమ్యూనిస్టులతో పొత్తుకు దూరం 

తమ పార్టీ కి భయపడి పొత్తుకు దూరమైన కాంగ్రెస్‌ 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోంది 

మీట్‌ ది ప్రెస్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

సాక్షి, హైదరాబాద్‌: ‘కమ్యూనిస్టులను కేసీఆర్‌ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్‌కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్‌ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్‌కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్‌ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు నష్టమని కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.  

అధికార పార్టీపై ఎదురుగాలి... 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు.

బీఆర్‌ఎస్‌ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్‌ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు.  

మగదేవుళ్ల ఆధిపత్యం 
సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్‌ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్‌ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్‌ సమాజమే అవుతుందన్నారు.  

వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... 
పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్‌మెంట్‌. నాలెడ్జ్‌ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్‌ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది.

ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్‌ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-11-2023
Nov 23, 2023, 14:04 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది....
23-11-2023
Nov 23, 2023, 13:39 IST
ప్రాజెక్టుల విషయంలో ఇలా జరగడం సహజం. ఆ మాత్రం దానికే విమర్శలు చేయడం.. 
23-11-2023
Nov 23, 2023, 12:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల...
23-11-2023
Nov 23, 2023, 12:24 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
23-11-2023
Nov 23, 2023, 12:17 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
23-11-2023
Nov 23, 2023, 11:53 IST
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్‌ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు....
23-11-2023
Nov 23, 2023, 11:46 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
23-11-2023
Nov 23, 2023, 11:39 IST
వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు...
23-11-2023
Nov 23, 2023, 10:05 IST
మహబూబ్‌నగర్‌: చిచ్చా బాగున్నావా.. మావా ఎక్కడ పోతున్నావ్‌.. ఓ అక్కా నీ బిడ్డ మంచిగ చదువుతుండా.. మొన్న వడ్లు ఎన్ని...
23-11-2023
Nov 23, 2023, 10:01 IST
నాకు ఇవే చివరి ఎన్నికలట. జగిత్యాలకు నేనేం చేయలేదట. మరి అభివృద్ధి విషయంలో.. 
23-11-2023
Nov 23, 2023, 09:55 IST
సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడు రోజులే గడువు ఉంది. అయితే 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి దీంతో...
23-11-2023
Nov 23, 2023, 09:47 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
23-11-2023
Nov 23, 2023, 09:38 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. నాడు అభ్యర్థులు కాలినడకన గ్రామాలను చుట్టేసేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్లు,...
23-11-2023
Nov 23, 2023, 08:41 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను...
23-11-2023
Nov 23, 2023, 07:48 IST
సాక్షి, ఆదిలాబాద్‌: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసి...
23-11-2023
Nov 23, 2023, 04:10 IST
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్‌/నల్లగొండ: ‘తెలంగాణలో మీరు అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు....
23-11-2023
Nov 23, 2023, 04:00 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్‌ఎస్‌కు...
23-11-2023
Nov 23, 2023, 03:54 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానందునే వివిధ పథకాలు ఆలస్యం అయ్యాయని సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాటలు...
23-11-2023
Nov 23, 2023, 03:45 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వికారాబాద్‌: ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా ఆగం చేసే పనులు జరుగుతాయని.. ఒక్కసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే ఐదేళ్లపాటు...
22-11-2023
Nov 22, 2023, 15:42 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. 

Read also in:
Back to Top