ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ సీట్ల చర్చ

SP, RLD discuss seat sharing in up elections - Sakshi

లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌదరీలు మంగళవారం లక్నోలో భేటీ అయ్యా రు. భేటీ తర్వాత ‘మంతనాలు ముగిశాయి’ అనే శీర్షికతో జయంత్‌ ఒక ట్వీట్‌ చేశారు. అఖిలేశ్‌ను కలిసినప్పటి ఫొటోను ట్వీట్‌కు జతచేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ఖరారుకాలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top