
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మళప్పురం జిల్లాలోని కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాలలో శుక్రవారం చికిత్స ప్రారంబించినట్లు తెలుస్తోంది. జులై 29 వరకు మరో వారం రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆయనకు తోడుగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్టీ మేనేజింగ్ డైరెక్టర్ మాదవన్ కుట్టీ వారియార్ సమక్షంలో చికిత్స కొనసాగనుంది.
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీ అంత్యక్రియలకు హాజరైన రాహుల్ గాంధీ.. ఆలస్యం కారణంగా తన కార్యక్రమాలను వాయిదా వేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు మోకాళ్ల నొప్పులు వచ్చాయని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ దేనికి చికిత్స తీసుకుంటున్నారనే విషయం పూర్తిగా తెలియదు. 116 ఏళ్ల చరిత్ర కలిగిన కొట్టక్కల్ ఆర్య వైద్యశాల ఆయుర్వేద చికిత్సలో దేశానికి సేవ చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన రోగులకు సైతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..