చంద్రబాబు, లోకేశ్‌ అవమానించారు | Pulivendula TDP Senior Leader Sathish Reddy Quits TDP And Joins In YSRCP - Sakshi
Sakshi News home page

TDP Leader Sathish Reddy Resigns: చంద్రబాబు, లోకేశ్‌ అవమానించారు

Published Thu, Feb 29 2024 8:30 AM

Pulivendula TDP Leader Sathish Reddy Join in YSRCP - Sakshi

వేంపల్లె:  మూడు దశాబ్దాలుగా టీడీపీకి ఎనలేని సేవలు చేసినా ఫలితం దక్కలేదని శాసన­మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌ వైఎస్‌ కుటుంబంతో లాలూచీ పడ్డానని తనను ఘోరంగా అవమానించారన్నారు. 

దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. కొంతమంది టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నానన్నారు. పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి కొన్నేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చిందిని చెప్పారు.

 అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలన్నారని, ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారని, ఇది ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆహా్వనం మేరకు తను వైఎస్సార్‌సీపీలోకీ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement