నిజంగా బీజేపీతో సంబంధాలు లేకపోతే ఆ పని చెయ్‌.. నితీశ్‌కు పీకే సవాల్‌

Prashant Kishor Latest Challenge JDU Nitish Kumar - Sakshi

పాట్నా: బిహార్‌ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ ఒకప్పుడు మంచి మిత్రులు. ఇద్దరు జేడీయూలో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం బద్దశత్రువులుగా మారారు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

నితీశ్ మహాఘట్‌బంధన్‌లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్‌లోనే ఉన్నారని పీకే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నితీశ్ తనదైన శైలిలో వీటిని తిప్పికొట్టారు. ఆయన పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడరతారని సెటైర్లు వేశారు.

తాజాగా నితీశ్‌కు మరో సవాల్ విసిరారు పీకే. నిజంగా ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలిగినప్పుడు ఆయన మాత్రం ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదని ట్వీట్ చేశారు. ఎప్పుడూ రెండు దారులు ఉండవు  నితీశ్ జీ అంటూ సెటైర్లు వేశారు.

 నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్‌లో చేరినప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని పీకే అన్నారు. రాజ్యడిప్యూటీ ఛైర్మనే అందుకు నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ  వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తానని నితీశ్ చెబుతున్నపటికీ ఆయనను నమ్మలేమని పేర్కొన్నారు. నితీశ్ 17 ఏళ్లు బిహార్ సీఎంగా ఉంటే.. అందులో 14 ఏళ్లు బీజేపీతోనే ప్రభుత్వాన్నిఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top