ఎన్నికల బాండ్ల రద్దు : ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల బాండ్ల రద్దు : ప్రధాని కీలక వ్యాఖ్యలు

Published Mon, Apr 15 2024 9:55 PM

Pm Modi Comments On Electoral Bonds Scheme In Ani Interview - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రద్దు చేయడం పట్ల ప్రతి ఒక్కరు బాధపడతారన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ విషయమై స్పందించారు.

ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేస్తాయని, బ్లాక్‌మనీని అరికట్టేందుకు తన మనసులోకి వచ్చిన ఆలోచనే ఎలక్టోరల్‌ బాండ్లు అన్నారు. బ్లాక్‌మనీ నిర్మూలనకు ఇదే మార్గమని తాను ఎప్పుడూ చెప్పలేదని ప్రధాని గుర్తు చేశారు. ఈ పథకంతో బీజేపీకే ఎక్కువ నిధులు వచ్చాయన్నదానిపై ప్రధాని మండిపడ్డారు. బాండ్ల అంశంలో విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. 

ఇదీ చదవండి.. దీదీ ఫైర్‌.. చాయ్‌కి బదులు అది తాగమంటారేమో 

Advertisement
 
Advertisement