బిహార్ ప్రత్యేక హోదా.. అసెంబ్లీ‍లో తీర్మానానికి ఆమోదం | nitish kumar party passes resolution for bihar special category status | Sakshi
Sakshi News home page

బిహార్ ప్రత్యేక హోదా.. అసెంబ్లీ‍లో తీర్మానానికి ఆమోదం

Jun 29 2024 1:51 PM | Updated on Jun 29 2024 3:12 PM

nitish kumar party passes resolution for bihar special category status

పట్నా: బిహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.  శనివారం రాష్ట్ర అసెంబ్లీలో బిహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్‌ పార్టీ జేడి(యూ) ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన  బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిహార్‌కు ప్రత్యేక హోదా  ఇవ్వాలని  ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్‌ దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

హోదా ఇవ్వాలని  కేంద్రాన్ని కోరుతూ.. నితీష్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ కొన్నేళ్ల నుంచి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జేడీ(యూ)తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరుగుతుందనటంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement