రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్‌నారాయణ | Minister Shankar Narayana Comments On Balakrishna | Sakshi
Sakshi News home page

రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్‌నారాయణ

Feb 4 2022 4:12 PM | Updated on Feb 4 2022 5:34 PM

Minister Shankar Narayana Comments On Balakrishna - Sakshi

రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ దుయ్యబట్టారు.

సాక్షి, అనంతపురం: రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే దీక్ష అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ ఏనాడు కృషి చేయలేదన్నారు.

చదవండి: సీఎం జగన్‌​కు కృత‍జ్ఞతలు తెలిపిన ముద్రగడ

హిందూపురానికి బాలకృష్ణ చుట్టపు చూపుగా వస్తారని  ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విశిష్టతను గుర్తించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని.. విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టి గౌరవించారని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement