Minister Karumuri Venkata Nageswara Rao Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

‘ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేదు.. ఆయనకు అడిగే హక్కులేదు’

Aug 3 2023 11:17 AM | Updated on Aug 3 2023 11:53 AM

Minister Karumuri Venkata Nageswara Rao Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆయన ఏనాడు ప్రజలకు మంచి‌ పని చేయలేదని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు.

సాక్షి, తిరుపతి: చంద్రబాబుకి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆయన ఏనాడు ప్రజలకు మంచి‌ పని చేయలేదని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఉదయం మంత్రి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి పరిపాలనలో మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగిందన్నారు.

ఏపీ అన్ని రంగాల్లో ముందుంది. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు, విమర్శలు చేసినా సీఎం జగన్‌ తాను పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భారతదేశంలోనే ఏపీ నంబర్‌ వన్ స్ధానానికి వస్తుందన్నారు. జీడీపీలో ఏపీ మొదటి స్థానంలో, విద్యలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement