‘చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’

Kurasala Kannababu Serious Comments Over TDP And Chandrababu  - Sakshi

సాక్షి, కాకినాడ: అధికారంలో లేనప్పుడే చంద్రబాబుకు రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీరియస్‌ అయ్యారు.

కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశానికి బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన సేవలు మరువలేనివి. ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదం. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎవరు వ్యవహరిస్తున్నారో చర్చకు చంద్రబాబు సిద్ధమా?. కళ్లబొల్లి కబుర్లతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజ్యాంగ పరిరక్షణా?. వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను కూలదోయడం రాజ్యాంగ పరిరక్షణా?. రాజ్యాంగ స్ఫూర్తి, పరిరక్షణ గురించి చంద్రాబాబా మాట్లాడేది?’ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top