బీఆర్ఎస్‌లోకి జీవన్‌ రెడ్డిని ఆహ్వానించనున్న కేటీఆర్‌ | Ktr to meet jeevan reddy | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌లోకి జీవన్‌ రెడ్డిని ఆహ్వానించనున్న కేటీఆర్‌

Apr 4 2026 9:24 PM | Updated on Apr 4 2026 9:24 PM

 Ktr to meet jeevan reddy

జగిత్యాల జిల్లా: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 12న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు. బీఆర్ఎ‌స్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆదిలాబాద్ పర్యటన అనంతరం మార్గమధ్యంలో కేటీఆర్‌ జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలువనున్నారు.  

బీఆర్ఎస్‌లోకి రావాలని జీవన్‌ రెడ్డిని కేటీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్‌లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు.  
ప్లీనరీ కంటే ముందే బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి. రాబోయే బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పక్కన ప్రత్యేక ఆకర్షణగా జీవన్ రెడ్డి నిలవనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సెలవు పలికారు.  కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నానని ఆయన చెప్పారు. రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ ప్రకారమే పార్టీలో చేరి సీఎం అయ్యారని అన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement