
అమృత్ కుంభకోణం బయటపెట్టినందుకు మెసేజ్‌లు వస్తున్నాయి
‘అమృత్’అంశంలో రేవంత్‌రెడ్డి, బీజేపీ కుమ్మక్కు బయటపడింది
సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో రేవంత్‌రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు అభినందన సందేశాలు వచ్చినట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కానీ రేవంత్‌రెడ్డి అక్రమాలపై బీజేపీ నేతల మౌనం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితు లను అధ్యయనం చేసేందుకు వెళ్లిన పార్టీ అధ్య యన బృందం సభ్యులను పోలీసులు అరెస్టు చేయ డాన్ని కేటీఆర్ ఖండించా రు. రాజకీయాలకు అతీ తంగా ప్రజాసంక్షేమం కోసమే స్వయంగా డాక్ట ర్లతో కూడిన తమ పార్టీ ప్రతినిధి బృందం ఆస్పత్రు లను సందర్శిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థ లోపా లను ఎత్తిచూపుతామని ప్రకటించారు.
ప్రభుత్వం నిజాలు దాచని పక్షంలో బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పట్టణ పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 400కు పైగా బస్తీ దవాఖానాలను నడపడం రేవంత్ ప్రభుత్వానికి చేతకావడం లేద న్నారు. ఓ వైపు విష జ్వరాలతో నగరవాసులు నరక యాతన పడుతుంటే, అసమర్థ పాలనలో ఆదుకో వాల్సిన బస్తీ దవాఖానాలకే సుస్తీ చేసిందన్నారు.
కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి విధ్వంసం చేసే ప్రయ త్నం చేశారని, సంఘటన వివరాలు, సునీతాలక్ష్మా రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతాలక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, 60 లక్షల మంది కేడర్ కలిగిన బీఆర్‌ఎస్ కుటుంబం ప్రతీ ఒక్కరికి అండగా ఉంటుందన్నారు.