వైఎస్సార్‌సీపీలో చేరిన గంటా అనుచరుడు

Kashi Vishwanath Joins YSRCP Welcomed By MP Vijayasai Reddy - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని, విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘సంవత్సరం క్రితమే కాశీ పార్టీలో చేరాల్సింది. కొన్ని కారణాలు వలన అవ్వలేదు. జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులందరు కాశిని పార్టిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు.

ఇక కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘టిడిపిలో చాలా ఇబ్బందులు పడ్డాను. పలు పదవులు ఆశ చూపి, ఆఖరికి అన్యాయం చేశారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రాజకియాలకు దూరంగా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితుడునై వైఎస్సార్‌ సీపీలో చేరాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలుపే దిశగా  చిత్తశుద్ధితో పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.

చదవండిజీవీఎంసీలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top